లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి

0

ఈ నెల 30న జాతీయ లోక్ అదాలత్
. కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలి
. జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరి కె. వెంకటేష్

కరీంనగర్:
ఈ నెల 30న కరీంనగర్ మరియు హుజురాబాద్ కోర్టులలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ కె. వెంకటేష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ బిల్డింగ్ లో జిల్లా లీగల్ సర్వీసెస్ సెక్రటరీ విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, ఢిల్లీ మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ కరీంనగర్ మరియు హుజురాబాద్ కోర్టులలో డిసెంబర్ 30 శనివారం జాతీయ న్యాయ సేవా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజీ చేసుకోదగిన 2021 క్రిమినల్, 350 సివిల్ కేసులను గుర్తించడం జరిగిందని, రాజీయే రాజమార్గంగా భావించే రెండు వర్గాల వారు లోక్ అదాలత్ ద్వారా వారి కేసులను సత్వరంగా పరిష్కరించుకోవాలని కోరారు. రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదా సంబంధించిన కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మోటార్ వెహికల్ చట్టం కు సంబంధించిన కేసులు, బ్యాంకు కేసులు మరియు చిట్ ఫండ్ కేసులను ఇరుపక్షాల సమ్మతితో పరిష్కరించబడునని అన్నారు. కేసుల తుది తీర్పు ద్వారా ఒక వర్గం వారు మాత్రమే గెలుస్తారని, రాజీపడడం ద్వారా ఇరువర్గాలు గెలుస్తారని, రాజీ పడ్డ కేసులకు తిరిగి అప్పీలుకు వెళ్లే ఆస్కారం ఉండదని అన్నారు. లోక్ అదాలత్ లో రాజీపడడం వల్ల కోర్టు ఫీజు మొత్తం తిరిగి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులలో చాలాన్ తో పాటు జైలు శిక్ష వేసే అవకాశం ఉంటుందని, అలాంటి కేసులను కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించి కొంతమేర వెసులుబాటు కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *