సావిత్రి బాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి

1

నేటి మహిళలంతా సావిత్రి బాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలి
. ప్రొఫెసర్ మారోజు స్వర్ణలత

హనుమకొండ:
ఆదర్శ జీవి సావిత్రి బాయి పూలే జీవితం నేటి తరం మహిళలందరికీ ఆదర్శవంతం కావాలని ప్రొఫెసర్ మారోజు స్వర్ణలత అభిలషించారు. అభ్యుదయ రచయితల సంఘం వరంగల్ ఆధ్వర్యములో స్థానిక ప్రభుత్వ విద్యా కళాశాలలో బూర బిక్షపతి అధ్యక్షతన ఘనంగా సావిత్రి బాయి పూలే 192 వ జయంతి ఉత్సవం జరిగింది. ఈ సందర్బంగా జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ స్వర్ణలత మాట్లాడారు. సావిత్రిబాయి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని దైర్యంగా నడిచిన యోధురాలని, దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలని అన్నారు. నేటి యువత ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ఆమెను ఆదర్శంగా తీసుకొని పోరాడాలని పిలుపునిచ్చారు. గౌరవ అతిథిగా పాల్గొన్న అరసం రాష్ట్ర అధ్యక్షులు డా. పల్లేరు వీరాస్వామి మాట్లాడుతూ..దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి నిలిచిందన్నారు. మనుస్మృతి నియమాలను పటాపంచలు చేస్తూ తన భర్త జ్యోతిబా పూలే చనిపోయినపుడు తానే చితికి నిప్పుపెట్టి నూతన సంప్రదాయానికి తెరలేపిందన్నారు. ఈ సమావేశంలో కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ ఆర్. విజయలక్ష్మి, అధ్యాపకులు బూర విద్యాసాగర్, డాక్టర్ మార్క శంకర్ నారాయణ, డాక్టర్ శ్రీరంగస్వామి, విద్యార్థులు శ్రావణి, మానస, ప్రియాంక, అరుణ, రాజ్ కుమార్, చంద్రకాంత్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *