అందుబాటులో కావలసిన్నని దరఖాస్తులు
జిల్లాలో కావలసిన్నని ప్రజా పాలన దరఖాస్తులు
. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్:
జిల్లాలో ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీ దరఖాస్తులు ఫారాలు కావలసినంత అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీ దరఖాస్తు ఫారాలు జిల్లాలో కావలసినంత అందుబాటులో ఉన్నాయని వీటికి ప్రజలకు ఉచితంగా అందించుటకు అందుబాటులో ఉంచామని, దరఖాస్తు ఫారాల కోసం ఎవరు కూడా ఆందోళన చెందవద్దని కలెక్టర్ తెలిపారు. జనవరి 6 వరకు నిర్వహించే ప్రజా పాలన అభయ హస్తం గ్యారంటీ దరఖాస్తుల స్వీకరణ ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు,మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గ్రామాలు, మున్సిపాలిటీలలో దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందన్నారు.