విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పోలవేణి రవి
– కార్మికుల నిరవధిక సమ్మె
హుజూరాబాద్:
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అప్పటి వరకు నిరవధిక సమ్మెను విరమించే ప్రసక్తే లేదని తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు అన్నారు. శుక్రవారం హుజురాబాద్ విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టిసన్ కార్మికులకు ఏపీఎస్ఈబి రూల్స్ వర్తింపచేయాలన్నారు. అన్ మ్యాన్ కార్మికులను ఆర్టిసన్గా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. విధుల్లో చనిపోయిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న పీస్ రేట్ కార్మికులని జోవో నెంబర్ 11 ప్రకారం కనీసవేతనాలు చెల్లించాలని, కార్మికులు యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చి 45 రోజులు దాటినా, పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు తెలిపిన యాజమాన్యంగాని, ప్రభుత్వం గాని చర్చలకి పిలవకుండా కాలయాపన చేస్తూ కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంది ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ హుజురాబాద్ అధ్యక్షులు పోలవేణి రవి, కార్యదర్శి వెంకటేష్, ఉపాధ్యక్షుడు పంజాల శ్రీనివాస్, ఉప్పల్ రవి, హనుమాన్ కార్మికులు వెంకటేష్ శివ, రవి, శ్రవణ్, రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
