జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు
జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలి
-. కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులు
కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన చిత్రా మిశ్రా ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కోకన్వీనర్, జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఫెడరేషన్ డైరీనీ కలెక్టర్ కు అందించారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లాలోని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కలెక్టర్ కు వివరించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ను కలిసిన వారిలో ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాదె కరుణాకర్ రావు, నరేందుల ప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి కిరణ్, నాయకులు సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
