ప్రణవ్ తోనే హుజూరాబాద్ అభివృద్ధి

0

ప్రణవ్ తోనే హుజూరాబాద్ అభివృద్ధి సాధ్యం..
– పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి.
– హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల అభివృద్ధికి 30 కోట్లు మంజూరు
– నిధులు మంజూరు పట్ల హర్షం
– ప్రణవ్ కి కృతజ్ఞతలు తెలిపి, సీఎం, మంత్రుల చిత్ర పటాలకు పాలాభిషేకం
హుజురాబాద్:
హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వోడితల ప్రణవ్ తోనే సాధ్యమవుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రణవ్ విజ్ఞప్తి మేరకు హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల అభివృద్ధి కి ప్రభుత్వం 30 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. గురువారం హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో, జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దిద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ హయంలో నగరాలకు ధీటుగా మున్సిపాలిటీలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. ఉప ఎన్నిక తర్వాత నిధులు మంజూరు కానీ హుజూరాబాద్ కు ప్రణవ్ నాయకత్వంలో నిధులు మంజూరు కావడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాళ్ళు, బ్లాక్ కాంగ్రెస్, యూత్, యువజన కాంగ్రెస్, మైనారిటీ నాయకులు, సీనియర్ నాయకులు, బీసీ, ఎస్సీ సెల్, సేవాదళ్ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *