జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వక కలిసిన టిడబ్ల్యూజెఎఫ్ ప్రతినిధులు
జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వక కలిసిన టిడబ్ల్యూజెఎఫ్ నూతన కార్యవర్గం..
జగిత్యాల:
జగిత్యాల జిల్లాలో నూతనంగా ఎన్నికైన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ కార్యవర్గం జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆయనను కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు ద్యావర సంజీవరాజు, కార్యదర్శి మేనేని రవీందర్ రావు, ఉపాధ్యక్షుడు రాగం రమేష్, కోశాధికారి ఎం శ్రీనివాసరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేణి కుంట శ్రీనివాస్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆముద లింగారెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శిలు పిప్పరి శ్రీనివాస్, అనంతుల కాంతారావు, మాణిక్యం గంగాధర్ తదితరులు ఉన్నారు.
