ప్రపంచ పర్యావరణం పై విద్యార్థులకు పోటీలు
ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు పోటీలు
హన్మకొండ:
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని “ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం” అంశం పై ఈ నెల జూన్ 5 న, వరంగల్ లోని కాకతీయ జూలోజికల్ పార్క్ లో ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ మరియు హన్మకొండ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యలో అవగాహనా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ సంయుక్త కార్యదర్శి పిట్టల రవిబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాద్రి మరియు వరంగల్ క్షేత్ర ముఖ్య అటవీ సంరక్షణాధికారి డి.భీమా నాయక్ ఐ.ఫ్.ఎస్, గౌరవ అతిథిగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఐ.ఏ.ఎస్, హన్మకొండ ఇంఛార్జి జిల్లా అటవీ అధికారి అనుజ్ అగర్వాల్, ఐ.ఫ్.ఎస్, మరియు కాకతీయ జూపార్క్ ఎఫ్.ఆర్.ఓ. మయూరి పాల్గొననున్నారు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా అవగాహనా నిమిత్తం ఆసక్తిగల పాఠశాల విద్యార్థులకోసం చిత్రలేఖనము, వ్యాసరచన మరియు వకృత్వ పోటీలను ఒకరోజు ముందు అనగా ఈ నెల జూన్ 4 వ, తేది ఉదయం గం.10:00 ని.ల నుండి మధ్యాన్నం గం.12:00 ని.ల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రతిభా పాఠవ పోటీలలో గెలుపొందిన మొదటి, రెండవ విజేతలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేస్తామన్నారు. హన్మకొండ ఫారెస్ట్ రేంజ్ అధికారిణి మయూరి ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఇందారం నాగేశ్వర్ రావు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. పోటీలో పాల్గొనే విధ్యార్థులు రిజిస్ట్రేషన్స్ కొరకు తమ పేర్లను ఎఫ్.ఆర్.ఓ మయూరి మొబైల్ నెం. 8019919959 లేదా సంయుక్త సెక్రెటరీ, ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ రవిబాబు పిట్టల మొబైల్ నెం. 9849425271 లకు కాల్ చేసి నమోదు చేసుకోని సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈసందర్భంగా అటవీ ఛాయా చిత్రాల ప్రదర్శన ఉంటుందని, అలాగే వన సేవ స్వచ్చంద సంస్థ కూడ ఈ కార్యక్రమ విజయంలో భాగస్వామ్యముంటుందని ఈ సందర్బంగా తెలిపారు.
