ఉద్యోగులకు పదవీ విరమణ సహజం

0

ఉద్యోగులకు పదవీ విరమణ సహజం
– ఎస్సారెస్పీ ఈఈ శశిభూషణ్
హుజురాబాద్:
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ సహజమని, విరమణ అనంతరం కుటుంబాలతో ఆనందంగా జీవించాలని ఎస్సారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) శశి భూషణ్ అన్నారు. ఎస్సారెస్పీ హుజురాబాద్ సబ్ డివిజన్-2 పరిధిలో ఉమెన్ మజ్దూర్ గా పనిచేసిన పర్వీన్ ఏప్రిల్ 30న పదవి విరమణ పొందారు. కాగా బుధవారం పర్వీన్ ఆత్మీయ వీడుకోలు సమావేశాన్ని కెసి క్యాంపు లోని డిఈ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈఈ శశిభూషణ్ మాట్లాడుతూ.. విశ్రాంత జీవితంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పదవి విరమణ కేవలం వృత్తికే కానీ వ్యక్తిత్వానికి, మనసుకు కాదని అన్నారు. అనంతరం పదవి విరమణ పొందిన పర్వీన్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఈ లు వెంకట రామ వరప్రసాద్, రాము, రవీందర్, డీఏఓ నాగయ్య, ఏఈ రతీశ్, సహచర ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *