మంత్రి పొన్నంకు శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ నాయకులు…
మంత్రి పొన్నంకు శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ నాయకులు…
హుజురాబాద్:
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో బుధవారం హుజరాబాద్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హుజురాబాద్ పట్టణానికి చెందిన కొలిపాక శంకరును హనుమాన్ దేవాలయం చైర్మన్ గా నియమించడం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి రావాలని ఈ సందర్భంగా మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గూడూరు స్వామి రెడ్డి, నేరెళ్ల మహేందర్ గౌడ్, మేకల తిరుపతి, మైనార్టీ నాయకులు ఎండి ఇమ్రాన్, నలుబాల వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.
