ఎమ్మెల్సీ కవితకు వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు
హైదరాబాద్:
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి..హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి తన అభ్యర్థిత్వం ఖరారు కావడానికి సంపూర్ణ సహకారం అందించిన కవితకు ఎంపీ రవిచంద్ర ఆమె నివాసానికి వెళ్లి ఫ్రూట్స్ తో కూడిన బుట్టను అందజేసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పారు.