ఏర్పాట్లు పరిశీలన…

1370

గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కరీంనగర్:
గణతంత్ర దినోత్సవంను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆన్నారు. గురువారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ ను సందర్శించి గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డీసీపీ రాజు, ఆర్డీవో మహేశ్వర్, ఏసిపిలు ప్రతాప్, నరేందర్, ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి, డిఈఓ జనార్దన్ రావు, డిడబ్ల్యూవో సరస్వతి, తాహసిల్దార్లు రాజేష్, నవీన్ కుమార్, సురేష్, ఆర్ఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *