బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

0

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

– బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండాల్ రెడ్డి

హుజరాబాద్:
హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులను ఆదరించి ఆశీర్వదించి గెలిపించాలని బిఆర్ఎస్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడవెల్లి కొండారెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని పలు వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే హుజురాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన హుజురాబాద్ కు చేసింది శూన్యం అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయన్నారు. పట్టణ ప్రజలు ఆలోచించి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, హుజరాబాద్ పట్టణ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *