బిజెపితోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యం..

0

బిజెపితోనే హుజురాబాద్ అభివృద్ధి సాధ్యం..

– ఒకసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి

– బిజెపి 20 వార్డు అభ్యర్థి దామెర అనూష-అనురాగ్

హుజురాబాద్:
హుజరాబాద్ పట్టణ అభివృద్ధి బిజెపి పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ 20వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దామెర అనూష-అనురాగ్ రోహిత్ అన్నారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో తనను ఒక్కసారి ఆశీర్వదించి వార్డును మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం 20 వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బిజెపి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల్లో హుజురాబాద్ మున్సిపల్ పై బిజెపి జెండా ఎగరడం ఖాయమని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వార్డులో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి బండి సంజయ్ సహకారంతో మరిన్నీ నిధులు తీసుకొచ్చి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ప్రజలంతా ఆలోచించి బిజెపి పార్టీకి ఓటేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో బిజెపి నాయకులు నల్ల సుమన్ వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *