బిఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్ ను ఆశీర్వదించండి: బిఆర్ఎస్ నాయకులు రమేష్(ఆర్కే)

0

హామీలను అమలులో కాంగ్రెస్ విఫలం
– హుజురాబాద్ మున్సిపల్ పై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం
– బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మంద రమేష్ (RK)
– 21 వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్ ను గెలిపించాలని ప్రచారం
హుజరాబాద్:
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మున్సిపల్ మాజీ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు మంద ఉమాదేవి-రమేష్ (ఆర్కే) ఆరోపించారు. శనివారం హుజూరాబాద్ పట్టణంలోని 21 వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్ ను గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం హాయంలోనే హుజురాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన హుజురాబాద్ కు చేసింది శూన్యం అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని, హుజురాబాద్ మున్సిపల్ పై బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ పట్టణ ప్రజలు ఆలోచించి బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *